Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జయలలితపై దాసరి దర్శకత్వంలో ‘అమ్మ’

dasariసీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు కొంత కాలంగా డైరెక్షన్‌కు దూరంగానే ఉంటున్నారు. కానీ ఆయన త్వరలోనే మళ్లీ దర్శకత్వ పగ్గాలు చేపట్టబోతున్నాడని తెలిసింది. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు ఆయన సిద్ధమ వుతున్నారని సమాచారం. ఇప్పటికై రైటర్ల బృందం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో కూడా ఉండగా… స్క్రిప్ట్ పూర్తికాగానే ఈ మూవీని తన దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు దాసరి నారాయణరావు సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఒకేసారి తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటుండగా… ‘అమ్మ’ అనే టైటిల్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ టైటిల్‌ను ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించడం కూడా పూర్తయిపోగా…త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందనే టాక్ చాలా నెలల నుంచే వినిపిస్తోంది. అయితే ఈ కథను ఫైనల్ చేసేందుకు దాసరి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Comments

comments