Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అమ్మే నన్ను నడిపిస్తోంది: శశికళ

Sasikala

చెన్నై: జయలలిత వెంట మూడు దశాబ్దాలకు పైగా తాను ఉన్నానని శశికళ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… తాను నిరంతరం జయతోనే ప్రయాణం చేశానని, అమ్మ ఆశీస్సులు తనకే ఉన్నాయని, ఆమె తనని నడిపిస్తోందన్నారు. జయలలిత, తాను ఎన్నో సంక్షోభాలను చూశామని, సమస్యలను ఎదుర్కొనే సమయస్ఫూర్తి అమ్మ సొంతమని కొనియాడారు. అమ్మ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు తెలిసిన వ్యక్తిని తానే అని వెల్లడించారు. అన్నాడీఎంకె పార్టీకి వ్యతిరేకంగా చేసే పనులేవి ఫలించవని హెచ్చరించారు. అన్నాడిఎంకె పార్టీ కంచుకోట అని, దాన్ని ఎవరూ కదపలేరని పేర్కొన్నారు.

సిఎం సీటు కోసం అమ్మ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. డ్రామాలు టివికి పనికొస్తాయని, పార్టీకి కాదని సూచించారు. అన్నాడిఎంకె కార్యకర్తలెవ్వరూ పార్టీని చీల్చరని, పార్టీకి వ్యతిరేకంగా కుట్ర పన్నితే సహించేది లేదని మండిపడ్డారు. మోసం చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.  మౌనంగా ఉంటే సరిపోదని, పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని వివరించారు. గతంలో పన్నీరు సెల్వానికి అమ్మ ఒక్క అవకాశం ఇచ్చారని, అదేదారిలో తాను కూడా సెల్వానికి ఒక్క అవకాశం ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు ఆలోచించాల్సింది లబ్ధి కాదని, ప్రజాక్షేమం గురించి అని ఆమె చెప్పారు.

Comments

comments