Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

8ఏళ్ల బాలుడు.. రెండు గిన్నిస్ బుక్ రికార్డులు!! 

guinnes-recordఇంఫాల్: పిట్టకొంచెం కూతఘనం అనే సామెత మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఈ సామెత మన ఈశాన్య భారతీయుడు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన టిలుక్ కైసమ్ అనే చిన్నారికి సరిపోతుంది. ఇంతకూ ఆయన చేసిన పని ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియోను తిలకించాల్సిందే. కైసమ్ తన 8ఏళ్ల వయస్సులోనే కొత్త గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించి ఔరా అనిపించాడు.

టిలుక్ కైసమ్ అనే ఈ చిన్నారి 475 అడుగుల దూరాన్ని కేవలం 30సెంటీమీటర్ల ఎత్తుగల హార్డిల్స్ కింది నుండి లింబో స్కేటింగ్ చేస్తూ వెళ్లడం ద్వారా ఈ రికార్డును సృష్టించాడు. దీంతో 2015లో తన పేరిట ఉన్న 116 మీటర్ల పూర్వపు గిన్నిస్ బుక్ రికార్డు తానే బ్రేక్ చేసినట్లైంది. గిన్నిస్ బుక్ రికార్డు కమిటీ ఈ చిన్నారి చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

Comments

comments