Home జాతీయ వార్తలు రోడ్డుపై హల్ చల్ చేసిన గజరాజం (వీడియో)

రోడ్డుపై హల్ చల్ చేసిన గజరాజం (వీడియో)

Elephent

అసోం : నగావ్ జిల్లాలో ఏనుగు వీరంగం సృష్టించింది. 36వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న కర్బీ అంగ్‌లాంగ్ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చాయి. కాగా… మందలో నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు రోడ్డు మీదకు వచ్చి అక్కడి ప్రజలను భయబ్రాంతులను చేసింది. దీంతో స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించారు.