Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రయోగాత్మక ప్రేమ కథ

RX-100

కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లుగా కె.సి.డబ్లు బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ఈనెల 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ  మాట్లాడుతూ “డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ సినిమా. సాధారణంగా లవ్ స్టోరీ అంటే ఎక్కడో కాఫీ షాప్‌లో మొదలవుతుందనే ధోరణి అలవాటైంది. మేం అలా కాకుండా లవ్ స్టోరీ అంటే ఏంటి? ప్రేమకి ఎలాంటి సమస్యలు రావచ్చు వంటి విషయాలను అన్నింటినీ విభిన్నంగా చూపించాం.  ఈమధ్య తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఒకే ఫార్ములాలోనే ఇవి ఉంటున్నాయి. ఈ తరహాలో ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు. ఈ సినిమాలో ఒక సమయంలో హీరో చాలా అమాయకంగా ఉంటాడు. హీరోయిన్ అతన్ని డామినేట్ చేస్తుంటుంది. ఇలాంటి స్టేజ్ నుంచి హీరో పూర్తిగా ఎలా మారిపోయాడు అనేదే ఈ సినిమా.  ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను ఇంకా దేన్నీ ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలయ్యాక నాకు డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది”అని తెలిపారు.

Comments

comments