Home జాతీయ వార్తలు సైనిక దిక్సూచి సక్సెస్

సైనిక దిక్సూచి సక్సెస్

isnrl

ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్ ప్రయోగం
విజయవంతంగా కక్షలోకి ఉపగ్రహం
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) గురువారం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 11 దిక్సూచీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి తెల్లవారుజామున 4.౦4 గంటలకు దీనిని ప్రయోగించారు. ఇస్రో ఉపగ్రహాల దొంతరలో ఇది ఎనిమిదవ ఉపగ్రహంగా ఇప్పుడు కక్షలో పరిభ్రమిస్తోంది. పిఎస్‌ఎల్‌విసి 41/ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 11 మిషన్ విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇక్కడి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదికగా నిలిచింది. అంతరిక్ష సంస్థ ఇస్రో నమ్మినబంటుగా ఉన్న పిఎస్‌ఎల్‌వి అత్యధిక స్థాయి ప్ర యోగ విజయాలను ఖాతాలో వేసుకుంది. స్పేస్ సెం టర్ నుంచి దీనిని ప్రయోగించిన తరువాత కక్షలోకి 19 నిమిషాల వ్యవధిలో నిర్ణీత గణాంకాల మేరకు చేరుకుం ది. దీనితో ప్రయోగం విజయవంతం అయిన విషయాన్ని నిర్థారించుకని స్పేస్ సెంటర్‌లోని శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణుల బృందం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఈ మరో అంతరిక్ష ముందడుగు పట్ల ఆనం దం వెల్లివిరిసింది. పిఎస్‌ఎల్‌వి నుంచి ఇప్పటివరకూ43 ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో ఇప్పటిది 41వ విజయవంతమైన ప్రయోగంగా రికార్డులలో నిలిచింది. 1425 కిలోల ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు ప్రధాన కేం ద్రంగా ఉన్న అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ వారు రూపొందించారు. ఇస్రో సహకారంతో దీని నిర్మాణం జరిగింది. ప్రైవేటు పరిశ్రమల సహకారంతో ఇస్రో రూపొందించిన రెండవ ఉపగ్రహం ఇదే. ఈ నావిగేషన్ శాటిలైట్ అన్ని వి ధాలుగా దేశ ప్రయోజనాలకు ఉపకరిస్తుంది.గత ఏడా ది ఆగస్గులో తొలి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1 హెచ్ ప్రయోగం విఫలం కావడంతో,దీని అంతరిక్ష ప్రవేశం సాధ్యం కాలే దు.
ఇస్రో ఛైర్మన్ అభినందనలు : ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ కె శివన్ వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను , ఇతరత్రా ఈ ప్రాజెక్టులో ప్రాతినిధ్యం వహించిన సాంకేతిక సిబ్బందిని శివన్ అభినందించారు. ఈ ఉపగ్రహం నిర్ధేశిత కక్షలోకి వెళ్లిందని , దీనిని ఖచ్చిత రీతిలో ప్రవేశపెట్టామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఈ ఉపగ్రహ సముదాయం ఇప్పుడు మరింత బలోపేతం అయిందని, ఈ నావిగేషన్ శాటిలైట్ల శ్రేణితో అట్టడుగు స్థాయి వరకూ ఇప్పటివరకూ అందని స్థాయి వరకూ సేవలు అందితీరుతాయని ఇస్రో ఛైర్మన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేసిన ఇస్రో కుటుంబానికి తాను రుణపడి ఉంటానని తెలిపారు. వారి అకుంఠిత దీక్షతోనే వారి కష్టఫలితంగానే ఈ ప్రయోగం విజయవంతం అయిందని అభినందనల సందేశం వెలువరించారు.
సైనిక ,పౌర సేవలలో ఈ ఉపగ్రహం : ఈ ఉపగ్రహం పలు విధాలుగా సేవలు అందిస్తుంది. సైనికులకు దిక్సూచీగా నిలుస్తుంది. వారి కదలికకు నేస్తంగా మారుతుంది. అంతేకాకుండా పౌరులకు వివిధ సేవలలో ఈ శాటిలైట్ ఉపయుక్తం అవుతుంది. ఈ ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను సంక్షిప్తంగా నావ్1సి గా పిలుస్తారు. దీనిలోని రిసీవర్ ద్వారా ఎలాంటి సంకేతాలను అయినా నిర్థిష్టంగా అందుకోవచ్చు. వాటిని నిర్ధేశిత స్ధానాలకు ప్రసారంచేయవచ్చు. ఇప్పటివరకూ అంతరిక్షంలో ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఎ స్థానంలో ఇప్పటి ఈ శాటిలైట్ కక్షలో పరిభ్రమిస్తుంది. ఇప్పటివరకూ ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌కు చెందని మూడు రుడిబియం ఆటామిక్ క్లాక్‌లు పనిచేయకుండా ఉండటంతో ఈ ఉపగ్రహం దెబ్బతింది. ఏడు ఉపగ్రహాల ప్రయోగ పరంపరలో పలు ఉపగ్రహాలను విజయవంతంగా కక్షల్లోకి ప్రవేశపెట్టారు.