Home మెదక్ మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య

మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య

Marred-image

మన తెలంగాణ/ చేగుంట : మంత్రాలు చేస్తున్నదన్న నెపం తో ఓ వృద్ధురాలిని హత్య చేసి న సంఘటన మెదక్ జిల్లా, నార్సింగి మండ లం నర్సంపల్లి గ్రామ పెద్ద తండాలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న తూప్రాన్ డిఎస్పీ రాంగోపాల్‌రావు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనలో 5గురిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నార్సింగి మండలం నర్సంపల్లి పెద్ద తండాకు చెందిన ముత్యాలి(70) మంత్రాలు చేస్తుందనే నెపంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుంజకు కట్టేసి ఇనుపరాడ్డుతో కొట్టి చంపారని డిఎస్పీ తెలిపారు. మృతురాలి సమీప బంధువైన దేశ్య, డద్య, లాక్కు, సూర్య, భుక్కులపై కేసు నమొదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇంటిపై దాడి చేసారని, ఇంటివెనక భాగాన నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, అగరవొత్తులు వారే పెట్టి మా నానమ్మ పెట్టిందని గుంజకు కట్టేసి చంపినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. 5 గురిపై కేసు నమొదు చేసి అదుపులోకి తీసుకుని శవాన్ని పోస్టుమార్టం తరలించినట్లు డిఎస్పీ తెలిపారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా సిఐ వెంకట్రాంరెడ్డి, ఎస్‌ఐలు సందీప్, నాగార్జునగౌడ్, బందోబస్తు నియమించినట్లు తెలిపారు.