Home స్పెషల్ ఆర్టికల్స్ ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు!

ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు!

NREGA-Labourన్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) వేతనం పెరిగే అవకాశలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జీవన వ్యయాల నుంచి పేదలను తప్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వేతనాల బేస్‌లైన్ సవరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ కూలీ రాష్ట్రాన్ని బట్టి మారుతోంది. 2016-17 ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకానికి ప్రభుత్వం రూ.38,500 కోట్లు కేటాయించగా ఈ సారి ఏకంగా రూ.9,500 కోట్లు పెంచి రూ.48,000 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పత్తి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గణనీయంగా కృషి చేస్తోందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.