Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అసంపూర్తి పనులతో ఆదర్శ పాఠశాల వసతి గృహ భవనం

Residential-schoolనిజామాబాద్: మారుమూల ప్రాంత విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్షంతో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఆదర్శ పాఠశాలలను ప్రారంభించిది. ఈ పాఠశాలలో ఆంగ్ల మాద్యమంలో విద్యను బోదించాలనేది ప్రభుత్వ లక్షం. పాఠశాలలో చదవడానికి ఆనేక మంది విద్యార్థులు ఆసక్తి చూపడంతో పాఠశాలో ఉన్న సీట్లన్ని భర్తీ అయ్యాయి. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులందరు మారుమూల ప్రాంతానికి హరిజన గిరిజన వర్గాలకు చెందినవారు ఉన్నారు. పాఠశాలలో మంచి విద్యాతో పాటు వసతి సౌకర్యం ఉంటుందని ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందారు. అయితే వసతి గృహం సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

రెండేళ్ళ క్రితం నిధులు మంజూరైన పూర్తి కాని పనులు….
వసతి గృహం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.కోటి 25 లక్షలు మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థినిలు ప్రతి రోజు పాఠశాలకు వచ్చి పోవలసి వస్తుంది. పాఠశాల సిరికొండ నుండి సమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరు వివిధ గ్రామాల నుండి వస్తున్న వారే. పాకాల, తూంపల్లి, కొండాపూర్, తాట్‌పల్లి, చీమన్‌పల్లి, పందిమడ్గు, తదితర గ్రామాలనుండి ఎక్కువ మంది పాఠశాలలో చదువుతున్నారు. చాలా మంది విద్యార్థులు అద్దెకు ఆటో మాట్లాడుకొని రోజు పాఠశాలకు వస్తుండగా ఇంకా కొంత మంది ఆర్టిసి బస్సుల్లో సిరికొండ వరకు వచ్చి అక్కడి నుండి కాలి నడకన పాఠశాలకు వెళుతున్నారు. పాఠశాలలో సుమారు 400మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ఆటోలో వచ్చే విద్యార్థులకు ఆర్థికంగా భారం కాగా సమయం వృధా అవుతుందని విద్యార్థులు అంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో పాఠశాలలో చేరామని రెండేళ్లయిన ఇబ్బందులు తప్పడం లేదని విద్యార్థినీలు బాధదపడుతున్నారు.

Comments

comments