Search
Friday 16 November 2018
  • :
  • :

గుర్తుతెలియని యువకుని శవం లభ్యం

young-man-dead

కరీంనగర్: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి ఫిల్టర్‌బెడ్ సమీపంలో గల చెట్ల పొదల్లో గుర్తుతెలియని యువకుని శవం లభ్యమైనట్లు టూటౌన్ ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 25-30 సంవత్సరాల వయస్సు గల యువకుని శవం లభించిందని మృతుని ఎడమ చేతిపై మహి అనే పచ్చబొట్టు ఉందని, ముదురు నీలిరంగు షర్ట్, లైట్ బ్లూకలర్ జీన్స్ పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు శవ పంచనామ జరిపి పోస్ట్‌మార్టం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Comments

comments