Home సినిమా అనగనగా ఓ ప్రేమ కథ

అనగనగా ఓ ప్రేమ కథ

O-Prema-Katha

ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు అల్లుడు కెఎల్‌ఎన్ రాజు నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రై.లి. అనే బ్యానర్‌పై రూపొందిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమ కథ’. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె.అశ్విన్‌ను ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా రిద్ధికుమార్, రా ధా బంగారు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. షూటిం గ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని యంగ్ హీరో వరుణ్‌తేజ్ ట్విట్టర్‌లో ఆవిష్కరించి సిని మా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కెఎల్‌ఎన్ రాజు మాట్లాడుతూ “ఈ సినిమా ద్వా రా నూతన హీరోహీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మంచి కథ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాము”అని అన్నారు.