Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

ఆలయంలో అగ్నిప్రమాదం

Fire Accident in Temple at Bhubaneswar

ఒడిశా : భువనేశ్వర్‌లోని అనంతవాసు దేవ ఆలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో 15 వంట గదులు దగ్ధమయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువ చేసే ఆహార సామగ్రి దగ్ధమైందని వారు పేర్కొన్నారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident in Temple at Bhubaneswar

Comments

comments