Home సినిమా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల కామెంట్లు.. ఫైరైన అనసూయ!

డ్రెస్సింగ్‌పై నెటిజన్ల కామెంట్లు.. ఫైరైన అనసూయ!

Anasuya-Bharadwaj

జబర్థస్త్.. ఈ పేరు వినగానే ఆ షో యాంకర్లు అనసూయ, రష్మీ గుర్తుకొస్తారు. ఈ షో ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మలు బుల్లి తెరపై మాత్రమే కాదు… వెండితెరపై కూడా తమ టాలెంట్ ని నిరూపించుకున్నారు. అయితే సినీ పరిశ్రమలో ఉన్నవారిని ఆన్‌లైన్‌లో విమర్శించడం, దూషించడం కొత్తేమి కాదు. ముఖ్యంగా ఆడవాళ్ల డ్రెస్సింగ్ పై నెటిజన్లు చేసే కామెంట్లను కొందరు తేలికగా తీసుకున్నా.. కొందరు సెలిబ్రిటీలు మాత్రం వాటిపై ధీటుగా స్పందిస్తుంటారు. తాజాగా యాంకర్ అనసూయకి మరోసారి అటువంటి అనుభవమే ఎదురైంది. తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఓ ఫాలోవర్ చేసిన కామెంట్ కి అనసూయ ఘాటుగా బదులు ఇచ్చింది.

టివి షోల్లో అనసూయ వేసుకొనే దుస్తులపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అనసూయ మీకు సెన్స్ ఉందా..? ఆ ఎక్స్‌పోజింగ్‌ ఏంటీ..? కుటుంబంతో కలిసి మేం టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నాం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. ‘అలాంటప్పుడు నుప్పు షో చూడకుండా ఉండూ.. కుటుంబ విలువల గురించి నీకు అంత పట్టింపు ఉంటే ఇతరుల విషయాల్లో తల దూర్చవు. నేనేం చేయాలి? ఏ దుస్తులు వేసుకోవాలి అన్నది నా పని. నా ఇష్టం. అయినా, బాలికలపై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వారిలో ఏం ‘ఎక్స్‌పోజింగ్‌’ మీకు కనిపిస్తుంది? మేం వినోదాన్ని అందించేవాళ్లం. మా పరిమితులు, మేం చేస్తున్న పనేమిటో మాకు తెలుసు. ఇతరులకు హుకుంలు జారీచేసే ముందు నీ పనేంటో నువ్వు చూసుకో’ అని అనసూయ పేర్కొంది.