Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పల్టీలు కొట్టిన హేమంత్ కారు…

పల్టీలు కొట్టిన హేమంత్ కారు…

Anchor-Hemanthఅమరావతి: ప్రముఖ నటుడు, యాంకర్, ఆర్జే హేమంత్ కారు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం మహమ్మద్ క్రాస్ రోడ్డు ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఓ గేదె తప్పించబోయిన హేమంత్ కారుతో గేదెను ఢీకొన్నాడు. దీంతో ఆయన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. విజయవాడలో మహర్షి సక్సెస్ మీట్ కి వెళ్లి హైదరాబాద్ కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

Anchor Hemanth Car Accident