Home తాజా వార్తలు కౌంటర్ ఇచ్చిన యాంకర్‌ రష్మీ…

కౌంటర్ ఇచ్చిన యాంకర్‌ రష్మీ…

Sexual exploitation of women happens every where address the bigger issue and stop

హైదరాబాద్: రష్మీ బుల్లితెరపై తనదైన స్టైల్ లో దూసుకుపోతోన్నసంగతి తెలిసిందే. పలు ప్రోగ్రామ్స్ లో యువ నటుడు సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల కాలంలో ప్రసారమైన ఓ టి వి షోలో వాళ్లిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్టు కూడా చూపించారు. దీంతో ట్విట్టర్‌లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి ఆగ్రహం తెప్పించాడు. సుధీర్‌ని పెళ్లి చేసుకో మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు. అని ఓ అభిమాని ఆమెకి ఉచిత సలహా ఇచ్చాడు. ఈ ట్వీట్ కి స్పందించిన రష్మీ మేము స్క్రీన్‌పై నటిస్తుండడం మాత్రమే మీరు చూశారు. అంతా మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు..? రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లను వేర్వేరుగా చూడడం నేర్చుకోండి అని చురకలంటించింది. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసమేనని స్పష్టం చేసింది. తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది తమకు సంబంధించిన విషయమని, తమకు ఎటువంటి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదు ఆమె స్పష్టం చేశారు.