Home తాజా వార్తలు త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకున్న‌ యాంక‌ర్ ర‌వి…

త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకున్న‌ యాంక‌ర్ ర‌వి…

Anchor-Raviహైదరాబాద్: ప‌టాస్ అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చే పేరు యాంక‌ర్ రవి. బుల్లితెరపై ప్ర‌స్తుతం బిజీగా ఉన్న మేల్ యాంక‌ర్స్‌ల‌లో అతను ఒకరు. అయితే, రవి టివి కార్యక్రమాలు చేస్తూనే పలు సిన్మాల్లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ షో సెకండ్ సీజ‌న్ జ‌రుపుకుంటుంది. అయితే, ఇటీవల జ‌రిగిన ఓ ఎపిసోడ్‌లో మ‌హిద‌ర్ అనే వ్య‌క్తి ఎపి ప్ర‌జ‌ల‌ను కించ ప‌రిచే విధంగా కామెంట్ చేశాడు. ఆ సందర్భంలో యాంక‌ర్ ర‌వి చప్పట్లు కొడుతూ వేదిక పైకి వెళ్ళాడు. అప్పుడు ర‌వి ప్ర‌వ‌ర్త‌న మ‌హిధ‌ర్ చేసిన కామెంట్స్‌ను సపోర్టు చేసే విధంగా ఉంద‌ని ఎపి ప్ర‌జ‌లు రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ర‌వి ట్విట్ట‌ర్‌లో వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. 23వ తేదీన ప‌టాస్‌లో మహిధ‌ర్ చేసిన కామెంట్స్ త‌ప్పు అని నేను, ప‌టాస్ ఒప్పుకుంటుంది. ‘మహిధర్’ క్షమాపణలు కూడా చెప్పాడు.

నేను ఆ సమయంలో అతడిని సపోర్ట్ చేయలేదు. యాంకర్‌గా అక్క‌డ ఎవ‌రు ఉన్నా అలానే చేస్తారు. ఇట్లాంటి వివాదాల‌లో ద‌య‌చేసి నన్ను లాగొద్దు. కాంట్ర‌వ‌ర్సీలు రావ‌డం, వాటికి వీడియోల ద్వారా వివ‌ర‌ణ ఇవ్వ‌డం నాకు కామ‌న్ అయిపోయిందని రవి పేర్కొన్నాడు. నేను తెలుగు వాడిని, నాకు ఎపి సిఎం జ‌గ‌న్ అంటే ఎంతో ఇష్టం. వారి ఫ్యామిలీతో కూడా మాట్లాడాను. మ‌రో నెల రోజుల‌లో జ‌గ‌న్‌ని క‌ల‌వ‌బోతున్నానని చెప్పుకొచ్చాడు. నేను సారీ చెప్పాల‌ని అంద‌రు అంటున్నారు. నేను త‌ప్పు చేయ‌లేదు. ఆ స్టేట్‌మెంట్‌ని మాత్రం నేను స‌పోర్ట్ చేయ‌నంటూ యాంక‌ర్ ర‌వి వీడియో ద్వారా తెలియజేశాడు.

Anchor Ravi Say Sorry to AP People