Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్టైల్ మార్చేసిన శ్రీముఖి

Srimuki

బుల్లితెరపైన కనిపించే యాంకర్స్ ఇప్పుడు మాటలతోనే కాదు తమ అందచందాలతో కుర్రకారు మనసు దోచేసుకుంటున్నారు. గ్లామర్ డ్రెస్సులతో… హాట్ లుక్స్‌తో చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు. వీరిలో చబ్బీ గర్ల్‌గా తనకంటూ మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. అడపాడదపా సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న ఈ భామ బుల్లితెరపై పలు షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె సినిమాల్లో పెద్ద రోల్స్ చేస్తోంది. ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ సినిమాలో నటిస్తున్న ఈ భామ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో ఎన్నడూ కనిపించని విధంగా వయ్యారాలు ఒలకబోసింది ఈ భామ. ఈ చిత్రంలో అమ్మడు త్రీ షేడ్స్‌లో కనిపించబోతోందట. దర్శకుడు హర్షవర్ధన్ ఏరికోరి మరీ ఆ పాత్రకు శ్రీముఖిని ఎన్నుకున్నాడట. మొన్నటివరకు హద్దులలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఈ చిత్రంలో స్టైల్ మార్చేసి హాట్‌గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలో తన పాత్రకు శ్రీముఖి ఏమేరకు న్యాయం చేస్తుందో చూడాలి.

Comments

comments