హైదరాబాద్ : బుల్లితెరపై తనదైన స్టైల్, స్మైల్, మాటలతో అందరిని ఆకట్టుకొనే తెలుగు యాంకర్ సుమ కనకాల. సుమ యాంకరింగ్ చేస్తుందంటే చాలు ఆ ప్రోగ్రాం సూపర్ హిట్ అయినట్లే. అయితే సుమ కేవలం మాటలతో మాత్రమే కాదు.. తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను కట్టిపేడిసింది.
ఇటీవల మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘వెలిపండితె పుస్తుకం’ చిత్రంలోని జిమ్మిక్కి కమ్మల్ పాటకు సుమ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో అప్లోడ్ చేయగా.. ఆ పాటను ఇప్పటికే 14 లక్షల మందికి పైగా వీక్షించారు. సుమ యాంకర్‌గా మాత్రమే కాదు డ్యాన్స్‌లో కూడా ఓ ఊపు ఊపేసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Looks like she is in love with this song 😀 @ItsSumaKanakala pic.twitter.com/tEZ0xGjKi0
— Jujubitv (@TheJujubiTV) September 14, 2017