Home తాజా వార్తలు మళ్లీ చిక్కుల్లో సంజయ్ దత్

మళ్లీ చిక్కుల్లో సంజయ్ దత్

Sanjay-Dutt

ముంబయి : అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించి గతేడాది విడుదలైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దర్శక, నిర్మాత షకీల్ నూర్ అనీను బెదిరించిన కేసులో సంజయ్ దత్ పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ సినిమా విషయంలో షకీల్ నూర్, సంజయ్ దత్ లకు మధ్య వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో షకీల్ నూర్ అనీ అంథేరి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు సంజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.