Home జోగులాంబ గద్వాల్ ఆగివున్న లారీని ఢీకొన్న వాహనం

ఆగివున్న లారీని ఢీకొన్న వాహనం

ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

                    DCM-and-Car-Collided

ఇటిక్యాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని బీచుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇటిక్యాల ఎస్.ఐ.జగదీష్ కథనం ప్రకారం… బీచుపల్లి దగ్గర గల జాతీయ రహదారిపై ఆంధ్రభూమి సర్క్యులేషన్ వాహనం మహబూబ్ నగర్ నుండి గద్వాల్ వైపు వెళుతుండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీ కంటైనర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని అన్నారు.

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన డ్రైవర్ మహబూబ్‌నగర్‌కు చెందిన హనుమంతు కాగా మరొకరు కర్నూల్ జిల్లాకు చెందిన ఏసురత్నంగా గుర్తించారని తెలిపారు. అదే విధంగా వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్.ఐ తెలిపారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా డిఎస్‌పి బాలకోటి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండాహైవే సిబ్బంది క్రమబద్ధ్దీకరించారు.