Home తాజా వార్తలు నోకియా2కు ఆండ్రాయిడ్ 8.1అపడేట్

నోకియా2కు ఆండ్రాయిడ్ 8.1అపడేట్

nokia
ముంబయి: గత అక్టోబర్‌లో హెచ్‌ఎండి గ్లోబల్ నోకియా-2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఆపరేటింట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. నోకియా-2 స్మార్ట్‌ఫోన్‌కు తర్వలో హెచ్‌ఎండి గ్లోబల్ ఆండ్రాయిడ్ 8.1 ఒరియో అప్‌డేట్‌ను అందివ్వనుంది. అయితే కొత్త ఒఎస్ అప్‌డేట్ విషయంపై ఇంకా తేదీని వెల్లడించలేదు. కాగా నోకియా-2 స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి వచ్చిన ఎంట్రి లెవల్ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. అయితే దీనికి గాను ఆండ్రాయిడ్ 8.1 ఒరియో గో ఎడిషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.