Home తాజా వార్తలు ఆండీ ముర్రే గుడ్ బైై

ఆండీ ముర్రే గుడ్ బైై

Andy Murrayగాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన బ్రిటన్ కు చెందిన మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే  అంతర్జాతీయ టెన్నిస్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెనే తనకు చివరిదని చెప్పాడు. మూడుసార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు ముర్రే. అయితే, గత కొంతకాలంగా ఆండీ తీవ్రమై నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇలా అర్ధాంతరంగా ఆట నుంచి తప్పుకోవడం బాధగా ఉన్న తప్పడం లేదని ముర్రే చెప్పుకొచ్చాడు. ముర్రే ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Andy Murray Says He Will Retire Australian Open