Home వికారాబాద్ పస్తుల్లో అంగన్‌వాడీలు

పస్తుల్లో అంగన్‌వాడీలు

గర్భిణులకు అందని పౌష్టికాహారం
సరుకులు అందించని సర్కారు
ఆందోళన చెందుతున్న కార్యకర్తలు

ANGAN

మన తెలంగాణ/తాండూరు : ప్రభుత్వం 3 సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో అంగన్ వాడీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లకు సరుకులు అందించడంలో ఆలస్యం చేయడంతో చిన్నారులు, గర్భిణులు పస్తులుంటున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం అంగ న్‌వాడీలకు సరుకులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.

దీంతో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కష్టంగా మారింది. సెంటర్లలో పని చేస్తున్న ఆయాల కు, కార్యకర్తలకు సైతం సక్రమంగా జీతాలు చెల్లించక పోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాండూరు డివిజన్‌లోని పెద్దేముల్, యాలాల, బషీరా బాద్, తాండూరు మండలాలతో పాటు తాండూరు పట్టణంలో సుమారు 300 వరకు అంగన్‌వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి నుండి మూడు వరకు అంగన్‌వాడీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలను నియమించారు.

గ్రామంలో ఉన్న ప్రతి 30 మంది చిన్నారులకు ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రామంలో ఉన్న గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. చిన్నారులకు సైతం పౌష్టికాహారం వండి వడ్డించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు. వీటితో పాటు వారంలో గుడ్లు, అరటి పండు అందించాలి. మొదట్లో ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అంగన్ వాడి సెంటర్లకు సరఫరా చేసేది. అనంతరం అంగన్ వాడి సెంటర్ల నిర్వహణ బాధ్యతను అంగన్ వాడీ కార్యకర్తకు అప్పగించింది.

సరుకులు ఆలస్యమైన కార్యకర్త కొనుగోళు చేసి చిన్నారులకు, గర్బీణులకు అందిం చాల్సి ఉంది. అయితే పెద్ద నోట్ల అనంతరం సరుకులు సక్రమంగా అంద డం లేదు, దీంతో అంగన్ వాడి కార్యక ర్తలు సైతం తమ వద్ద డబ్బులు లేక పోవడంతో చిన్నారులకు గర్బీణీలకు పౌష్టి కాహారం అందించడానికి అవస్థలు పడుతున్నారు. కొన్ని సెంటర్‌లలో చిన్నారులు పస్తులు ఉంటున్నారు. మరి కొందరు గ్రామంలో అప్పులు చేసి చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తు న్నారు. మరో పక్క అంగన్ వాడి కార్యక ర్తలకు, అయాలకు జీతాలు కూడా సక్రమంగా చెల్లిం చడం లేదని వారు వాపోతున్నారు. చిన్నారులకు. గర్బీణీల కు అందిం చే పౌష్టికాహారంలో ప్రభు త్వం ఆలస్యం చేయవద్దని సకాలంలో సరుకులు అందించాలని నెలనెల జీతా లు చెల్లించాలని అంగన్ వాడీలు కోరుతున్నారు.