Home తాజా వార్తలు అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు…

అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు…

Anganwadi-Centers

నిడమనూరుః స్త్రీ సంక్షేమశాఖా ఆధ్వర్యంలో చిన్నారులకు కిశోర బాలికలకు ,బాలింతలకు,గర్భిణులకు పౌష్టికాహరం అందించి ఆటపాటల ద్వారా పూర్వ ప్రాధమిక విధ్యను అందించేందుకు అంగన్‌వాడి కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే ప్రతిష్టాత్మకమైన ఐసిడీఎస్ ప్రాజెక్టు ద్వారా సేవలందించే కేంద్రాలు మాత్రం సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
నిడమనూరు మండలంలో ఇదీ పరిస్ధితిః నిడమనూరు మండలంలో మొత్తం 56అంగన్‌వాడీ కేంద్రాలుండగా ఇందులో పెద్ద కేంద్రాలు 48, మిని కేంద్రాలు 08,వీటి పర్యవేక్షణకు ఇద్దరు సూపర్‌వైజర్‌లు,45 మంది అంగన్‌వాడీ టీచర్లు, 44మంది కార్యకర్తలు,40మంది ఆయాలు విధులు నిర్వహిసున్నారు. ఇందులో మొత్తం ఏడు నెలల నుంచి మూడు ఏళ్ల పిల్లలు 476 మంది ఉన్నారు.
నిడమనూరు మండలంలో బంకాపురం,గుంటిపల్లి,ముప్పారం-1,నందికోండవారిగూడెం,నిడమనూరు-3,రాజన్నగూడెం-1, వెంగన్నగూడెం,వెనిగండ్ల,ఇండ్లకోటయ్యగూడెం,మారుపాక,మారుతివారిగూడెం,ముకుందాపురం-1,నారమ్మగూడెం-1,రేగులగడ్డ,తుమ్మడం-1,వడ్డెరీగూడెం,ఎర్రబెల్లి,శాఖాపురం,గ్రామాలల్లో సోంతభవనాలు ఉన్నాయి.మిగితావాటిలో 18 అద్దెభవనాలు అద్దెలేని భవనాలు (ప్రాధమిక పాఠశాల,పంచాయితీ కార్యాలయాల్లో )కేంద్రాలు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా మిగితా 20 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెభవనాలు కోనసాగుతున్నాయి.
గర్భిణిలకు పౌష్టికాహరం: 1000మంది గర్భీణిలు, 591మంది బాలింతలు,నమోదు కాబడితే వారికి ఒక్కపూట సంపూర్ణాహరం అందించేదుకు ఆరోగ్యలక్ష్మీ నిత్యం అమలు చేస్తుంటారు. అలాగే 2056 మంది కిశోర్‌బాలింతలకు ప్రతి నెలకు పౌష్టికహరం సరఫరా చేస్తుంటారు. ఈ నేపధ్యంలో నిత్యం సేవలందించే ఈ కేంద్రాలకు స్వంత భవనాలు లేక అరకొర వసతులో కోట్టుమిట్టాడుతున్నాయి.
అద్దెభవనాలు..అరకొర వసతులుః నిత్యం సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలు పెద్ద పెద్ద గ్రామాలల్లో రెండు లేదా మూడు సెంటర్లు చిన్న గ్రామాల్లో ఒక్కో సెంటర్ ఉంటాయి. కాని ఈ కేంద్రాలకు ప్రభుత్వం సొంత భవనాలు మంజూరు చేయక కొంత ,మంజూరైన వాటిలో నిర్మాణాలు పూర్తికాక అసంపూర్తిగా మిగిలినవి కొంత ఉండడంతో నిర్వాహణ కొరకు భవనాలను అద్దెకు తీసుకోని సెంటర్‌లను నడుపుతున్నారు. కొన్ని గ్రామాల్లో అద్దె భవనాలు దోరక ప్రభుత్వ భవనాల్లో ,లేదా పంచాయితీ కార్యాలయాలల్లో ,కమ్యూనిటీ సెంటర్‌ల్లో నడుపుతున్నారు.దీంతో చిన్నారులు సేవలకు ఇళ్ల మధ్యన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు కార్యకర్తలు వాపోతున్నారు.
సొంతభవనాలు లేవుః.ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సైధాభేగం, నిడమనూరు.
నిడమనూరు మండలంలో కేవలం 18 గ్రామాలల్లో సోంతభవనాలు ఉన్నాయి. ఇదేవిధంగా నిడమనూరు-1,2,4,5,నర్సింహ్మలగూడెం,రాంనగర్,ముప్పారం,మార్లగడ్డతండా,సోమారిగూడెం,రాజన్నగూడెం-2,సూరేపల్లి,జంగాలగూడెం,ముకుందాపురం-2,తుమ్మడం-2,వేంపాడు,బొక్కమంతులపహడ్-1,2,వెంకటాపురం,నిడమనూరు మండల కేంద్రంలోని సాగర్ గడ్డ(మిని)1,బంటువారిగూడెం,గ్రామాలల్లో అద్దెభవనాల్లో సెంటర్‌లు నిర్వహిస్తున్నారు.వీటిలో పిల్లలకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం.కొన్ని గ్రామాల్లో మార్చాలని ఒత్తిడిలు వస్తున్నాయి. గ్రామాల్లో సొంత భవనాలు ఏర్పాటుకు ప్రతిపాధనలు పై అధికారులకు పంపించామన్నారు.

Anganwadi Centers In Rental Buildings in Nidamanoor