Home భద్రాద్రి కొత్తగూడెం గర్భిణి స్త్రీ పై అంగన్‌వాడి ఆయా, ఆమో భర్త దాడి..

గర్భిణి స్త్రీ పై అంగన్‌వాడి ఆయా, ఆమో భర్త దాడి..

Anganwadi worker Attacked on Pregnant Woman

 

కొత్తగూడెం : జిల్లాలోని ఒక అంగన్‌వాడి సెంటర్‌లో సోమవారం దారుణం జరిగింది. తన కూతురు గురించి అడగటానికి వెళ్లిన గర్భిణి బాదావత్ పద్మపై అంగన్‌వాడి సెంటర్ ఆయా, ఆమె భర్త తీవ్రంగా దాడి జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే… టేకులపల్లి మండలంలోని మద్దిరాల తండాకులో ఒక అంగన్‌వాడి సెంటర్ ఉంది. అందులో ఇస్లావత్ జ్యోతి టీచర్‌గా, మాళోతు నీల ఆయాగా పని చేస్తున్నారు. పౌష్టికాహరం ప్రతి రోజు గర్భిణి స్త్రీలకు, పసిపిల్లలకు అందజేయాల్సి ఉంటుంది. పద్మకు ఇద్దరు ఆడపిల్లలు, మేఘన(5), అభినయశ్రీ(3). అభినయశ్రీని అంగన్‌వాడి సెంటర్‌లో సరిగ్గా పట్టించుకోవటంలేదని అలా ఎందుకు చేస్తున్నావని, తనకు, తన కుమార్తెకు గుడ్లు ఇవ్వాలని పద్మ సెంటర్‌కు వెళ్లి ప్రశ్నించి, డిమాండ్ చేసింది. దీనితో ఆయా నీల తన భర్త మాళోతు వీరును సెంటర్ కు పిలిపించింది. పద్మ పై పిడిగుద్దులు కురిపించారు. దీనితో పద్మకు రక్తస్రావం కావటంతో ఆమె అలాగే ఇంటికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి ఆమెకు గర్భస్రావం అయ్యింది. పరిస్థితి విషమించడంతో ఆమెను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టేకులపల్లి సిఐ నాగరాజు, ఎస్ ఐ ప్రవీణ్‌కుమార్ లు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో విచారణ నిర్వహించిన రూరల్ సిడిపివో
కాగా ఈ సంఘటన గురించి తెలియగానే మనతెలంగాణా ఈ విషయమై ఐసిడిఎస్ పిడి ఝాన్సి దృష్టికి తీసుకెళ్లి, వివరణ కోరగా తనకు ఈ విషయం తెలియదని వెంటనే విచారణ నిర్వహిస్తామన్నారు. కొద్దిసేపటికి కొత్తగూడెం రూరల్‌ సిడిపివో కనకదుర్గ కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి వచ్చి బాధితురాలు పద్మతో మాట్లాడి, ఆమె బందువులను సైతం విచారించారు. తన కూతురు అభినయశ్రీని అంగన్‌వాడీ సెంటర్‌కు పంపిస్తే తనను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అడకటానికి వెళ్తే తనపై దాడిచేశారని సిడిపిఓకు వివరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయా ఆమె భర్త పద్మపై దాడిచేస్తుంటే టీచర్ జ్యోతి సినిమా చూసినట్టుగా చూస్తుందే తప్పా ఆయాను కాని వారించలేదని పద్మ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ వాధించి ఉంటే పద్మకు గర్భస్త్రావం అయ్యేదికాదని వెంటనే టీచర్‌ను, ఆయాను సస్పెండ్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anganwadi worker Attacked on Pregnant Woman

Telangana Latest News