Home నిర్మల్ అంగన్‌వాడీల్లో వెల్లివిరిసిన ఆనందం

అంగన్‌వాడీల్లో వెల్లివిరిసిన ఆనందం

Anganwadi-Teachers

బాసర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపథకాలను ప్రవేశపేట్టిన వాటికి ముందుండీ ప్రచారం చేయడంలో అంగన్‌వాడీల పాత్రకీలకంగా ఉంటుంది. సమగ్ర శిశు అభివృధ్దిపథకంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు భాగస్వామ్యం తప్పనిసారి . అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా పల్స్ పో లియో, ఓటర్లజాబిత, శిశు జనన మరణాలు, గర్భిణులు, బాలింతలు, చూలింతులు పట్ల పోషకాహారాలు ఏలా తీసుకోవాలి. గ్రామంలోని కిషోరబాలికలు, బడీడు పిల్లలను గుర్తించి వారికి పాఠశాలలో చేర్పించడంతో పాటు బాల్యా విహవాహనాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మహిళలలో రక్తహీనతతను గుర్తించివారికి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం బాలబాలిక పట్ల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ద వహిస్తు గ్రొత్‌మానిటారింగ్ ద్వార ప్రభుత్వాలకు నీవేదికలను పంపించి గర్భిణులు పుట్టిన బిడ్డ చిన్నారులకు వారం మాసంలో టీకాలను వేయించడం, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఇలాంటి పథకాలు తమ శాఖకాకుండా ఆరోగ్య శాఖ తదితర రిజిష్టర్లు సక్రమంగా చేస్తు ప్రతి నెల ప్రభుత్వానికి నీవేదిక రూపంలో అందించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాల నుండి చాలీచాలనీ వేతనాలతో పనిచేస్తున్నారు. సీఐటీయూ అనుబంద సంస్థతో కలిసి పలుమార్లు తమ జీతాలను పెంచాలని మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కాకుండా రాజధాని ఢీల్లిలో జంతమంతర్ వద్ద కూడా చాలా సార్లు ధర్నాలను నిర్వహించారు.

ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంగన్‌వాడీల పట్ల ప్రత్యేక చొరువను తీసుకోన్నారు. గతంలో ఏ ప్రభుత్వం తీసుకో లేని నిర్ణయం కేసిఆర్ తమ చాంబార్‌లో దాదాపు రెండువంద మంది అంగన్‌వాడీకార్యకర్తలో సుదీర్ఘంగా చర్చలను జరిపి వారి సమస్యలను అ డిగి తెలుకున్నారు.వారికి వేతనాలను పెంచడమే కాకుండా అర్హతను బట్టిపర్యవేక్షరాలు పోస్టులను భర్తీచేస్తానని ,ఆయాలకు జీవిత భీమాతోపాటు అంగన్‌వాడీకేంద్రాల్లో సన్నబియ్యం, గర్భిణులుకుపోష్టికాహారం అందిచేందుకు బలోపేతంచేశారు.

గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లుగా పనిచేస్తున్నవారికి ఉపాధ్యాయులుగా గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ,వారి కోసం రెండు పడకల గదులను సైతం నిర్మిస్తామని హమినిచ్చారు. గతంలో అంగన్‌వాడీలకు రూ 7000, ఆయాలకు రూ 4500 ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారీకంగా ఏప్రీల్ 01 వతేదినుండి పెంచిన జీతంలో అంగన్‌వాడీలకు రూ 10500, ఆయాలకు రూ 6000 పెంచడంతో రాష్ట్ర ముఖ్య మ ంత్రికి ఆంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు జన్మంతా రుణపడి ఉంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి వెల్లడించిన నూతన వేతనాల పట్ల వారి చిత్రపటానికి పలుచోట్ల పాలాభిషేకాలను నిర్వహించారు.

నిర్మల్ జిల్లాపరిధిలోని ముథోల్, ఖానాపూర్,నిర్మల్, భైంసా ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ ప్రధాన , ఉపకేంద్రాలు 812 అంగన్‌వాడీ కార్య కర్తలు, 674 మంది ఆయాలు పనిచేస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు , ఆయాలు మొత్తం 1486 మంది ఉన్నారు. అందులో ఆంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 7000, ఆయాలకు 4500 ఇస్తున్నారు. పెరిగిన వేతనాలతో జిల్లాలో కోటిన్నర ఆదాయం ప్రయోజనంచేకుర నుంది. ముఖ్యమంత్రి అంగన్‌వాడీకార్యకర్తపట్ల వరాల కురిపించడంతో నూతనంగా అంగన్‌వాడీలకు రూ 10500, 6000 అంగన్‌వాడీకార్యకర్తలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.