Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

తుదిపోరుకు సెరెనా, కెర్బర్

serena

 ఓస్టాపెన్కోను ఓడించి రెండోసారి వింబుల్డన్ ఫైనల్‌లోకి చేరిన ఏంజెలిక్
 రెండో సెమీఫైనల్‌లో సెరెనా గెలుపు
లండన్: జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ బుధవా రం మహిళా సింగిల్స్‌లో 63 నిమిషాలపాటు హోరాహోరి పో రాడి లాత్వియాకు చెందిన 12వ సీడ్ క్రీడాకారిణి జెలెనా ఓస్టేపెంకోను 63, 63 వరుస సెట్లలో ఓడించి రెండో వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకుంది. మొదటి సెట్లో 33తో సమంగా ఉండి ఆట తీవ్రంగా కొనసాగింది. ఓస్టాపెన్కో ఫోర్‌హ్యాండ్ లాంగ్ షాట్లతో చెలరేగిపోయింది. 24 రిటర్న్ విన్నర్స్‌ను సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్స్‌లో ఎవరూ చేయని దానికంటే రెట్టింపు రిటర్న్ విన్నర్స్‌ని ఆమె సాధించింది. కానీ ఆమె సర్వ్‌లో విఫలమైంది. సెట్ పాయింట్‌లో ఆమె డబుల్ ఫాల్ట్ కూడా చేసింది. దాతో కెర్బర్ బాగా సర్వ్ చేయడమేకాకుండా సూపర్బ్‌గా డిఫెండ్ చేసింది. తర్వాత ఓస్టాపెంకో దాడిని తిప్పి కొడుతూ 51 ఆదిక్యతను పొందింది. ఓస్టాపెంకో స్వల్ప పాయింట్ల తేడాతోనే కొన్ని గేమ్‌లు ఓడిపోయింది. కెర్బర్ బాగా పుంజుకుని ఆడింది. ఇక ఫైనల్స్‌లో కెర్బర్ తదుపరి ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ లేక జర్మనీకే చెందిన జూలియా జార్జెస్‌తో తలపడనున్నది.
సెరెనా అలవోకగా..
అమెరికా టెన్సిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గురువారం సెమీఫైనల్‌లో జర్మనీకి చెందిన జూలియా జార్జెస్‌ను వింబుల్డన్ టోర్నమెంట్‌లో 63, 64తో ఓడించి ఫైనల్‌కు చే రుకుంది. వారిరువురి మధ్య 70 నిమిషాలపాటు ఆట కొనసాగింది. ఇది సెరెనా విలియమ్స్‌కు 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. అ యితే పదిన్నర ఏళ్ల కూతురికి జన్మనిచ్చాక మొదటిది. ఆమె ఇ ప్పటి వరకు 23సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచింది. సెరెనా తదుపరి ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడనున్నది.

నాదల్, జొకోవిచ్ ఫైనల్ పోరు
వింబుల్డన్ ఫైనల్ స్పాట్ కోసం నాదల్, .జొకోవిచ్ శుక్రవారం 52వసారి తలపడబోతున్నారు. ప్రపంచ నం. 1 నాదల్ ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వద్ద 2008, 2010లో ఛాంపియన్‌గా నిలిచాడు. అ తడు జొకోవిచ్‌తో 2625 గెలుపులతో వెనుకబడి ఉన్నాడు. వారిద్దరి మధ్య 12 ఏళ్ల క్రితం రో లాండ్ గారోస్ నుంచి నువ్వానేనా అన్న పోటీ ఉంది. 32 ఏళ్ల నాదల్ 2011 తర్వాత వింబుల్డ న్ సెమీఫైనల్స్‌కు తిరిగొచాడు. అప్పట్లో అతడు జొకోవిచ్‌కు రన్నరప్‌గా నిలిచాడు. నాదల్ 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు పోటీపడుతున్నాడు. ఫెదరర్ కన్నా రెండు స్థానాలు వెనుక ఉన్నాడు. ఫెదరర్ ఈ మధ్య క్వార్టర్‌ఫైనల్స్‌లో కెవిన్ అండర్సన్ చేతిలో ఓడిపోయాడు. జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్‌లో 13వ సెమీఫైనల్స్‌కు పోటీపడుతున్నాడు. అతడు 2016 యుఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాక గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు రావడం ఇదే మొదటిసారి.

Comments

comments