Home ఆఫ్ బీట్ అపురూప ఓషధి మొక్క ఉనికికి ముప్పు

అపురూప ఓషధి మొక్క ఉనికికి ముప్పు

Medicine

కేన్సర్ వ్యాధులకు దివ్య ఔషధంగా గుర్తింపు పొందిన ఏంజెలికా ఔషధమొక్క ఉనికి ఇప్పుడు అపాయంలో పడింది. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది. ఐరోపాలో కూడా కొన్ని చోట్ల ఇది లభిస్తుంది. ఆసియా దేశాల్లో ఇదొక ముఖ్యమైన ఓషధి మొక్కగా గుర్తిస్తున్నారు. ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని కేన్సర్ బయోలజీ లేబొరేటరీ, సియోల్‌లోని షామియూక్ యూనివర్శిటీ, కొలొరాడో యూనివర్శిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ డెన్వర్ పరిశోధకులు ఏంజెలికా వేరులో మూలకాన్ని కనుగొన్నారు. కేన్సర్‌ను నివారించే శక్తిగల ఔషధ లక్షణాలు పూర్తిగా ఉన్నట్టు భావిస్తున్నారు. కొరియన్ ఏంజెలికా నుంచి వడబోసి తీసిన ఈ మూలకాన్ని డికర్సిన్‌గా పిలుస్తున్నారు.

ఇదే కేన్సర్ నివారిణిగా చెబుతున్నారు. ట్యూమర్ల పెరుగుదలను కూడా ఇది నివారిస్తుందని తాజా అధ్యయనంలో కనుగొన్నారు. మిన్నిసోటా యూనివర్శిటీ, నింగ్ బో యూనివర్శిటీలతోపాటు చైనాలోనూ దీనిపై పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. రొమ్ముకేన్సర్‌పై దీని ప్రభావంఎలా ఉంటుందో చైనావారు పరిశోధించారు. 2004 05 నుంచి డికర్సిన్‌పై అధ్యయనం చేస్తున్నామని, ఆయుర్వేదంలోనూ దీని ప్రస్తావన ఉందని జెఎన్‌యుకు చెందిన పరిశోధకులు ఒకరు చెప్పారు. ప్రాణదాత అయిన ఈ మొక్క అపాయంలో పడింది.  బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎల్‌హెచ్‌టి సంస్థ ఈ ఓషధ మొక్కలను రక్షిస్తోంది. పూర్వీకులు ఇది దుష్టశక్తులను నివారించే మంత్రమూలికగా భావించేవారు. ప్లేగు నివారణకు దేవత ఇచ్చిన దివ్య వనమూలికగా నమ్ముతుంటారు.