Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతి పే…ద్ద హిందూ దేవాలయం

Cambodia-angkor-wat4

ఆంగ్ కోర్ వాట్… ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పెద్ద విష్ణు మూర్తి దేవాలయం పేరు ఇది. ఎప్పుడైనా విన్నారా ఈ పేరుని. లేదే.. ఎప్పుడూ వినలేదే… ఎక్కడుంది ఈ గుడి.. చెప్పండి వెంటనే వెళ్లొస్తాం అంటారా.

Cambodia-angkor-wat3

పక్కా… ఈ గుడి మన ఇండియాలోనే ఎక్కడో ఒకచోట ఉంటుందని మీరు అంచనా వేసి ఉంటారు. అయితే, అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఎందుకంటే, ఈ గుడి ఉన్నది కంబోడియాలో. అవును.. అసలు హిందువుల రాజ్యమైన భారత్ లో ఈ గుడి లేకుండా… కంబోడియాలో ఈ గుడి ని ఎవ్వరు కట్టిచ్చారనేగా మీ డౌట్.

Cambodia-angkor-wat2

అక్కడికే వస్తున్నా… ఈ గుడిని కంబోడియాలోని అంగ్ కోర్ వద్ద నిర్మించారు. 12 వ శతాబ్దంలో సూర్యవర్మన్ అనే రాజు దీన్ని నిర్మించాడట. హిందు సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకలా నైపుణ్యం ఈ గుడిలో కనిపిస్తుంది.

Cambodia-angkor-wat1

పూర్వం కంబోడియాలో హిందూ సంస్కృతి ఎక్కువగా ఉండేదట. 9 నుంచి 15 వ శతాబ్దం కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండో సూర్యవర్మ తో పాటు చాలా మంది హిందూ రాజులు కంబోడియాను పాలించారట. అందుకే అక్కడ హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ గుడిని నిర్మించారట.

angkor-wat-with-water

చైనా రికార్డల ప్రకారం అప్పట్లో ఈ ప్రాంతమంతా భరతఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేదట.

Angkor-Wat1

జీవితంలో కనీసం ఒక్కసారైన దర్శించుకోవాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఈ గుడి ఒకటట. అంతే కాదు, దీని పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో మరో గుడి ఉంటుంది. దాని పేరు.. ఆంగ్ కోరు థోమ్. ఇది కూడా అద్భుతమైన దేవాలయమట ఇది. ఇక్కడ కూడా పురాణ కళా కృతుల నిర్మాణాలు ఉంటాయట.

angerkon1

ఇక, ఈ ఆంగ్ కోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారు ముప్పై ఏళ్లు పట్టిందట. అంతే కాదు, ఈ దేవాలయ నిర్మాణం అచ్చం… మన దేశంలోని తమిళనాడు లోని దేవాలయాలను పోలి ఉంటుందట.

ఎప్పుడైనా కంబోడియా వెళ్తే.. తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకొని వస్తారు కదూ….

Comments

comments