Search
Saturday 17 November 2018
  • :
  • :

అప్పటివరకు కుంబ్లేనే కోచ్‌గా కొనసాగింపు

  • బిసిసిఐ సిఒఎ ఛీప్ వినోద్ రాయ్ ప్రకటన
  • ఛాంపియన్స్ ట్రోఫీతో ముగియనున్న అనిల్ పదవీకాలం
  • జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ సిరీస్

Anil-Kumble

ముంబయి : భారత క్రికెట్ జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లే వెస్టిండీస్ సిరీస్ వరకు కొనసాగనున్నట్టు బిసిసిఐ సిఒఎ ఛీప్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ సిరీస్ వరకు కోచ్‌గా కుంబ్లే కాంట్రాక్టును పొడిగిస్తు న్నట్టు రాయ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో అతని పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు లేవనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల భారత నియంత్రణ క్రికెట్ బోర్డు (బిసిసిఐ) క్రికెట్ సలహాదారు కమిటీ (సిఎసి) సభ్యులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస కూడిన కమిటీ అనిల్ కుంబ్లేను టీమిండియా కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. బిసిసిఐ సీనియర్ సభ్యులు సహా బిసిసిఐ అధ్యక్షుడు సికె కన్నా, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, కుంబ్లే తొలగింపులో మార్పులు చేయనుండటంతో అతను కోచ్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి జూన్ 8న లండన్‌లో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ దాదాపు రెండు గంటల పాటు చర్చించింది.

కానీ, ఈ విషయంలో బిసిసిఐ సిఇఒ రాహుల్ జోహ్రి మరింత సమయం కావాలని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం సిఎసి మరోసారి చర్చించిన అనంతరం కుంబ్లేను టీమిండియా కోచ్‌గా దక్షిణాఫ్రికా సిరీస్ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. అయితే కోచ్‌గా కుంబ్లే కాకుండా ఎవరిని ఎంపిక చేసినా వారి పదవీకాలం 2019 ప్రపంచ కప్ వరకూ కాంట్రాక్ట్ కొనసాగుతుందని కన్నా వెల్లడించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి, కుంబ్లేకు మధ్య విభేదాలు ఉన్నట్టు వరకు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ ఎంపిక విషయమై బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించగా, వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments