Home తాజా వార్తలు తదుపరి చిత్రం జూలైలో షురూ

తదుపరి చిత్రం జూలైలో షురూ

ఇటీవల ‘ఎఫ్2’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్‌బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వివరాలను తెలుసుకునేందుకు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జూలై నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా దర్శకుడు అనిల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారట.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు స్క్రిప్ట్‌లో యాక్షన్ అంశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. ఇక మహేష్‌బాబుకు జోడీగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

Anil Ravupudi, Mahesh babu movie start in July!