Search
Wednesday 14 November 2018
  • :
  • :

మొబైల్ డాక్టర్….

Petts

డాక్టర్ ఉమాశంకర్ దేవకర్ అనిమల్ మొబైల్ క్లినిక్ నడుపుతున్నారు. రోజుకు ఆరు నుంచి ఏడు కుక్కలకు చికిత్స చేస్తారు. ఆయన ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ… లోకల్ బ్రీడ్ (పెంపుడు కుక్కలు)లో మాంగ్రల్ ఎక్కువగా ఉంటుంది. అదేకాకుండా, ముదోల్‌హాండ్ కూడా ఒక రకమని అన్నారు. ఇవికాకుండా విదేశీ కుక్కల్లో లాబ్రాడర్, గోల్డెన్, రిట్రివరి, పగ్, జర్మన్ షెఫర్డ్, సింగిల్ కాల్, డబుల్ కోల్, గ్రేట్ డెయిన్, సెయింట బర్నాడ్, డ్యాష్, హాండ్, డాల్మిషన్, లాషఆప్స, షిట్జ్, పమేరియన్, మినియేచర్, పికనిస్, ఇంగ్లీష్‌హాండ్, హస్కి వంటివి ఎక్కువగా సెలబ్రిటీల ఇళ్లల్లో ఉంటాయని తెలిపారు.

2011 నుండి ఈ మొబైల్ క్లినిక్‌ను నడుపుతున్నానని దేవకర్ అన్నారు. ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి ఫోన్‌కాల్స్ వస్తుంటాయని ఆయన అన్నారు. పప్పి స్టేజి నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని, లేదంటే కుక్కలకు పార్వో ఓవిరస్ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. షార్ట్ బ్రీడ్ ఆయుఃప్రమాణం 12 నుంచి 16 సంవత్సరాలు ఉంటుందని, అదే పెద్ద కుక్కలైతే 12 సంవత్సరాలు వరకు బతికే అవకాశం ఉందన్నారు. ఒకప్పుడు ఇంట్లో మనం తినే ఆహార పదార్థాలనే కుక్కలకు పెట్టేవాళ్లమని, ఈ డాగ్ ఫుడ్స్ వచ్చాక, అదొక పెద్ద వ్యాపారమైపోయిందన్నారు.

కుక్కలకు బ్యూటీపార్లర్‌లు కూడా ఉన్నాయని, వాటికి నెయిల్ క్లిప్పింగ్, హెయిర్ కటింగ్, స్నానం చేయించటం, చెవులు శుభ్రం చేయడం లాంటివి నేరెట్టి సాయికుమార్ చేయిస్తారని, ఒక్కో సిట్టింగ్‌కు రెండు, మూడు వేల రూపాయల వరకు అవుతుందన్నారు. మెషిన్‌తో హెయిర్‌కటింగ్ చేయాలంటే, వారికి అనస్తీయా ఇచ్చి చేస్తారని, దానికి ఎక్కువ చార్జీ వసూలు చేస్తారన్నారు. కుక్కలకు సర్జరీ చేయడానికి హైదరాబాద్ క్లినిక్, అనిమల్ కేర్ క్లినిక్, డాక్టర్ డాగ్ క్లినిక్‌లు ఉన్నాయని అన్నారు.

విదేశాలకు వెళ్లేవారు తమ కుక్కలను డాగ్స్ హాస్టల్స్‌లో ఉంచుతారు. ఇందుకోసం వారు రోజుకు 300 నుంచి 350 రూపాయల వరకు వసూలు చేస్తారు. సినీ హీరో చిరంజీవి ఇంట్లో మూడు, మోహన్‌బాబు ఇంట్లో తొమ్మిది , మహేష్‌బాబు ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయట, వాటికి దేవకరే వెళ్లి మొబైల్ క్లినిక్‌ల ద్వారా సపర్యలు చేస్తున్నారు.

పిల్లులు
పిల్లుల్లో పర్షియన్ పిల్లులకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. సినీ నటి విజయ నిర్మల ఇంట్లో పర్షియన్ పిల్లి ఉందన్నారు. ఆస్తమా రోగులు పిల్లుల్ని పెంచకపోవడమే మంచిదని ఆయన అన్నారు. అయితే, పెట్స్ వల్ల మానసిక ఆనందం కలుగుతుందని, తద్వారా కొన్ని రోగాల బారినపడకుండా ఉంటారన్నారు.

Comments

comments