Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జీర్ణక్రియను పెంచే అంజీర

Anjeer

కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు ఉండే అంజీర్  డ్రైఫ్రూట్  ఏడాది పొడుగునా మార్కెట్‌లో లభ్యమవుతూనే ఉంటుంది.  వీటిల్లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. సి, ఎ, బి6 విటమిన్లు,  పొటాషియం, కాల్షియం పుష్కలం. సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లాంటి  ఇతర ఖనిజ లవణాలు కూడా తగు మోతాదులో ఉన్నాయి.  జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అంజీర్ బాగా ఉపయోగపడుతుంది.  బరువు తగ్గడానికి , ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.  గుండెజబ్బులు, క్యాన్సర్‌లకు  మంచి ఔషధం. కాల్షియం పీచు రూపంలో ఉండేది అంజీర్‌లో మాత్రమే. రోగనిరోధక శక్తిని పెంచే డ్రైఫ్రూట్ ఇది. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. ఏ వ్యాధితో బాధపడుతున్నవాళ్లయినా అంజీర్‌ను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. జ్వరం వచ్చి తగ్గిన వెంటనే రెండు అంజీర్లను తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి వస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొంతమందికి శ్వాస మార్గంలో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టమౌతుంది. ఇవి తినడం వల్ల సమస్య తొలగుతుంది. పొటాషియం, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. నోటిపూతలాంటి సమస్యలుంటే ఇవి తింటే సరిపోతుంది. నిద్రలేమిని దూరం చేయడంలో వీటి పాత్ర అమోఘం.  పడుకునే ముందు రెండు మూడు అంజూర్లను తిని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారంలో రెండు అంజీరలను తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతుంది.

Comments

comments