Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రూ.5లకే అంత మంచి భోజనమా… లోకేష్ కు ట్వీట్

రూ.5లకే అంత మంచి భోజనమా… లోకేష్ కు ట్వీట్

 

అమరావతి: ఎపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్‌లో ఆసక్తికరమైన ట్వీట్‌కు స్పందించారు. జగదీశ్ అనే నెటిజన్ అన్న క్యాంటీన్లు బాగున్నాయని, అన్న క్యాంటీన్‌లో భోజనం రుచికరంగా ఉందని పొగుడుతూ నారా లోకేష్‌కు ట్వీట్ చేశారు. ఐదు రూపాయలకే అంత మంచి భోజనం దొరికినందుకు వంద రూపాయలు ఇచ్చేందుకు ప్రయత్నించాను. కానీ అక్కడ ఉన్న సిబ్బంది తమ వద్ద డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో  అన్న క్యాంటీన్లలో డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేయాలని లోకేష్‌కు జగదీశ్ ట్వీట్ చేశారు. దీంతో లోకేష్ స్పందిస్తూ నీ ఐడియా బాగుందని మెచ్చుకోవడమే కాకుండా, అతి త్వరలో ప్రతిపాదనను అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు జగదీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

Anna Canteen Meals Good: Tweet to Lokesh