Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోడీకి అన్నాహజారే లేఖ

ANNA

ఢిల్లీ : రైతు సమస్యలపై ఢిల్లీలో ఆందోళన చేసేందుకు జన్‌లోక్‌పాల్‌కు అనుమతివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి సామాజికవేత్త అన్నాహజారే మంగళవారం లేఖ రాశారు. మార్చి 23న నిరసన తెలిపేందుకు ఓ ప్రాంతాన్ని చూపించి అనుమతి ఇవ్వాలని ఆయన తన లేఖలో మోడీని కోరారు. రైతు సమస్యలపై నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సంబంధిత శాఖలతో పాటు హోమంత్రికి పలు లేఖలు రాసినా, వారి నుంచి స్పందన రాలేదని హజారే తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును అమలు చేయాలని కోరుతూ ఇప్పటి వరకు మోడీకి 43 లేఖలు రాశానని, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం బలహీనపరిచిందని ఆయన ధ్వజమెత్తారు.

Anna Hazare’s letter to Prime Minister Modi

Comments

comments