Search
Wednesday 14 November 2018
  • :
  • :

మరో 20వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు స్థాయీ సంఘం గ్రీన్‌సిగ్నల్

Another 20,000 double bedroom houses in the city are green signal

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో మరో 20వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన పరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపించాల్సిన ప్రతిపాదనలకు మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) స్థాయీసంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు అదనంగా మరో 20 వేల ఇళ్ల నిర్మాణాలను రూ.1730 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదనలను జిహెచ్‌ఎంసి అధికారులు రూ పొందించారు. ఈ ప్రతిపాదనలను స్థాయీసంఘం సమావేశానికి ప్రతిపాదించ గా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జిహెచ్‌ఎంసి స్థాయీసంఘం సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 21 అంశాలకు సభ్యులు తీర్మానించారు. ప్ర ధానంగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర అంశాలు ఉన్నాయి. సమావేశానికి స్థాయీసంఘం సభ్యులతో పాటు జిహెచ్‌ఎంసి

స్థాయీ సంఘంఅమోదించిన అంశాలు…

1. జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డైరక్టర్‌కు రూ.20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు అనుమతులు.
2. ఫలక్‌నుమా రైల్యే స్టేషన్ ఆర్‌ఓబి వద్ద సమాంతరంగా మరో ఆర్‌ఓబి నిర్మాణంకు అనుమతి.
3. ఖాజాగూడ క్రాస్ రోడ్ నుంచి నానక్‌రాంగూడ ఔటర్ రింగ్‌రోడ్ వరకు 150, 200 అడుగుల రోడ్డు విస్తరణకుగాను 170 ఆస్తుల సేకరణ.
4. మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనువుగా బోటానికల్ గార్డెన్ నుంచి కొండాపూర్ ఆర్‌టిఏ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ చేసేందుకు 227 ఆస్తుల సేకరణ.
5. నారాయణమ్మ కళాశాల నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు రోడ్డు విస్తరణ సందర్భంగా కోల్పోయిన భూములకుగాను ముగ్గురికి నష్టపరిహారం చెల్లింపు.
6. ఇంజనీరింగ్ విభాగంలో ఇటీవల ఔట్ సోర్సింగ్ విధానంలో నియమాకమైన 175 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు రూ.3.48 కోట్లు వేతనాల చెల్లింపు.
7. అంబర్‌పేట్ క్రాస్ రోడ్ నుంచి నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికిగాను రూ.87,34,40,234 విడుదల. మెహిదీపట్నం పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 13 వద్ద సబ్‌వే నిర్మాణానికి రూ.4 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి పరిపాలన సంబంధిత ప్రతిపాదనలు.
8. గచ్చిబౌలి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 60 అడుగుల మేర రోడ్డు విస్తరణ సందర్భంగా 144 ఆస్తుల సేకరణ.
9. నాంపల్లి యూసుఫ్‌గూడ దర్గా నుంచి కేఫ్ జంక్షన్ వరకు 12 మీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయడానికి 44 ఆస్తులను సేకరణ.
10. అపోలో క్యాంపస్ నుంచి జూబ్లీహిల్స్ వరకు 18 మీటర్లు, 24 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకుగాను 96 ఆస్తుల సేకరణ.
11. ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్ నెట్‌వర్క్‌ను రూ.3,10,49,641లతో ఆధునీకరణ, అప్‌గ్రేడ్ చేయడానికి, కాప్రాలో శ్రీనివాస్‌నగర్ క్రాస్‌రోడ్ నుంచి ఈశ్వరిపూరి క్రాస్‌రోడ్ వరకు రూ.2.80 కోట్లతో అభివృద్ది చేసేందుకు పరిపాలన సంబంధిత ఆమోదం.
12. నాచారంలో ఆధునిక చేపల మార్కెట్‌ను రూ.2.44 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు అంచనా వ్యయ ప్రతిపాదనలు.
13. నగరంలో ఎస్‌ఆర్‌డిపి పనులకుగాను గతంలో సేకరించిన బాండ్ల నుంచి రెండవ విడతగా మరో రూ.200 కోట్ల తీసుకునేందుకు, బాండ్ల ద్వారా నిధుల సేకరించినందుకుగాను ప్రోత్సాహకంగా రెండు శాతం వడ్డీ మొత్తం రూ.26 కోట్లను జిహెచ్‌ఎంసికి అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన అమృత్ మిషన్ డైరక్టర్‌కు ప్రతిపాదనలు పంపే తీర్మానం.
14. భవన నిర్మాణాల అనుమతుల సందర్భంగా భవన వ్యర్థాలను తరలించేందుకు నిర్ణీత టిప్పింగ్ ఫీజును ఖరారు చేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా
అమోదించారు.

Comments

comments