Home గాసిప్స్ రద్దయిన పాత నోట్ల డిపాజిట్ కు మరో అవకాశం…!!?

రద్దయిన పాత నోట్ల డిపాజిట్ కు మరో అవకాశం…!!?

old banned india currency of rs. 500 and 1000

నవంబర్ 8 న రూ. 500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత… డిసెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, వేరే నోట్లతో మార్పిడి చేసుకోవడం లాంటి ఆప్షన్స్ ను ప్రభుత్వం ఇచ్చింది.

అయితే, డిసెంబర్ 30 దాటినప్పటికీ.. కొంతమంది ఇంకా పాతనోట్లను డిపాజిట్ చేసుకోలేదు. అయితే, ఆర్బిఐ లో సరైన పత్రాలు సమర్పించి మార్చి వరకు వాటిని మార్చుకోవచ్చని ప్రభుత్వం మరో ఆప్షన్ ఇచ్చినప్పటికీ… తాము సంపాదించిన డబ్బుకు సరైన పత్రాలు లేకపోవడంతో ఆర్బిఐ దృష్టికి ఈ విషయాన్ని కొంతమంది తీసుకెళ్లారు.

బినామీల డబ్బులు, అక్రమంగా, అవినీతి తో సంపాదించిన డబ్బులు కాకుండా ఉండి, సక్రమంగా సంపాదించిన పాత నోట్లు ఇంకా ఉంటే…అప్పుడు మాత్రమే… రద్దయిన పాత రూ. 500, 1000 నోట్లను మరోసారి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఆర్బిఐ యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఇంకా అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేనప్పటికీ… కేంద్ర ప్రభుత్వం తో చర్చించి మరోసారి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తున్నది.

మరి.. మీ దగ్గర ఇంకా రద్దయిన రూ. 500, 1000 నోట్లు ఉంటే… కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూడండి. ప్రకటన రాగానే వెంటనే ఆలస్యం చేయకుండా బ్యాంకుల్లో వేసేసుకోండి. రద్దయిన నోట్లు ఇంకా ఉన్నవాళ్లకు ఇది బంపరాఫరే…