Home జాతీయ వార్తలు కేరళలో మరో వివాదం: కొండెక్కేందుకు మహిళలకు అనుమతి

కేరళలో మరో వివాదం: కొండెక్కేందుకు మహిళలకు అనుమతి

Agasthyarkoodam

తిరువనంతపురం: కేరళలో మరో వివాదం రాజుకోనున్నది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్ల వయసులోబడి ఉండే మహిళలకు ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తీర్పును వ్యతిరేకిస్తున్న హిందూత్వ శక్తులకు, తీర్పును అమలు చేయాలన్ప సంకల్పంలో ఉన్న రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉండగా, కేరళలోని రెండవ అత్యంత ఎత్తయిన పర్వతమైన అగస్తర్‌కూడమ్‌ను అధిరోహించడానికి మహిళలకు అవకాశం కల్పించడానికి రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేపట్టడం వివాదంగా మారనున్నది. నెయ్యర్ అభయారణ్యంలో నెలకొని ఉన్న అగస్తర్‌కూడమ్ పర్వతాన్ని మహిళలు అధిరోహించడంపై ఉన్న నిషేధాన్ని హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ తొలగించింది. అయితే తాము సాంప్రదాయంగా కొలిచే అగస్త మహాముని విగ్రహం ప్రతిష్టించి ఉన్న కొండపైకి మహిళలు ప్రవేశించడానికి వీలు లేదని కని అనే గిరిజన తెగ మొదటి నుంచి వాదిస్తోంది. హిందూ పురాణాలకు చెందిన అగస్త ముని పేరుతో ఆ పర్వతాన్ని అగస్తర్‌కూడమ్‌గా పిలుస్తారు.

అగస్తర్‌కూడమ్ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించే యాత్రికులపై లింగవివక్ష పనికిరాదని కేరళ హైకోర్టు నవంబర్ 30న తీర్పు చెప్పింది. దీంతో ఈ పర్వతారోహణకు మహిళలపై ఉన్న అనధికారిక నిషేధం తొలగిపోయింది.  రాష్ట్రప్రభుత్వం కూడా పర్వతారోహణకు మహిళల ప్రవేశాన్ని అంగీకరిస్తూ అగస్తర్‌కూడమ్ అభయారణ్యంలో ఉందని, కొండపైన ఎటువంటి ఆలయం లేనందున ఆ ప్రాంతంలో ప్రార్థనలు జరిపే సాంప్రదాయ హక్కులేవీ కని తెగకు లేవని హైకోర్టుకు వివరించింది.  1,868 మీటర్ల ఎత్తయిన అగస్తర్‌కూడమ్ ఎక్కేందుకు ఏటా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వ్యక్తులకు అటవీ శాఖ అనుమతి ఇస్తుంది. రెండు రోజుల పాటు సాగే ఈ ట్రెక్కింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని శారీరకంగా బలంగా ఉండే 14 సంవత్సరాల వయసు పైబడిన మహిళలకే అటవీ శాఖ కల్పిస్తోంది

Another Controversy may trigger in Kerala, The Kerala High Court had on November 30 last year ruled that no gender-based restrictions can be imposed on those who intend to trek Agasthyarkoodam, and lifted the unofficial ban on the entry of women to the peak.