Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్‌పై మరో అనర్హత వేటు

నవాజ్ షరీఫ్‌పై మరో అనర్హత వేటు

Sharif

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ మరో ఎదురు దెబ్బ తగిలిం ది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, 63 కింద అనర్హత వేటుకు గురైన వ్యక్తి రాజకీయ పార్టీకి అధినేతగా ఉండడానికి వీలులేదని పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. తీర్పును ప్రధాన న్యాయమూర్తి నిసార్ చదివి వినిపించారు. దీం తో నవాజ్ షరీఫ్ ఇకపై అధికార పార్టీ పిఎంఎల్‌ఎన్‌కు అధినేతగా ఉండడానికి అనర్హుడు. పనామా పేపర్ల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు 2017 జులైలో 68 ఏళ్ల నవాజ్ షరీఫ్‌ను ఆర్టికల్ 62 కింద అనర్హుడిగా ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 62, 63లకు అనుగుణంగా పార్టీ అధినేతలుండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి సఖీబ్ నిసా ర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. పార్లమెంటును నడిపే నాయకుల ప్రవర్తన మెరుగ్గా ఉండాలని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. పిఎంఎల్‌ఎన్ పార్టీ రిజిస్ట్రేషన్‌పై తీర్పు ప్రభావం ఉండదు కానీ షరీఫ్ తీసుకునే నిర్ణయాలు చెల్లబోవు. ఎన్నికలకు ఆయన జారీ చేసే టికెట్లు కూడా చెల్లబోవు. ఈ తీర్పుతో పాకిస్థాన్‌లో మార్చి 3న జరిగే ఎగు వ సభ ఎన్నికలు వాయిదాపడనున్నాయని తెలుస్తోంది. లండన్‌లో ఉన్న విలువైన ఆస్తులకు సంబంధించిన షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షరీఫ్, ఆయన సంతానం, అల్లుడిపై సెప్టెంబర్ 8న కోర్టులో మూడు కేసులు నమోదయ్యాయి.