Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్

Maoistsవిశాఖ : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం కాల్పులు జరిగిన మల్కన్‌గిరి జిల్లాలోని రామ్‌గఢ్ -పవన్‌పుట్ మధ్య అటవీ ప్రాంతంలోనే మళ్లీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 24 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం విదితమే.

Comments

comments