Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్ లో మరో అంతార్జాతీయ సదస్సు

Azmeera-Chandulal

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వనరులు తగ్గిపోతున్నాయని, నీటిని సంరక్షించుకోవడమే మన విధి అని తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి మంత్రి చందూలాల్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా  మరో అంతర్జాతీయ సదస్సు జరగనుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలతో పోటీపడి సదస్సులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు.  హైదరాబాద్ మహా నగరంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ సదస్సు జరగనుందని ఆయన తెలిపారు. ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.నీటి వనరులను సంరక్షణ కోసం ఈ అంతర్జాతీయ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని,  ఈ సదస్సుకు 50 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుర్రా వెంకటేశం అన్నారు.

Comments

comments