Home సినిమా మరో రకంగా మనోవేదన

మరో రకంగా మనోవేదన

చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ప్రేమ వ్యవహారాలు అతన్ని నీడలా వెంటాడుతున్నాయి. మాజీ ప్రియురాళ్లు ఏదో రకంగా అతన్ని వేధిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు భామలతో ప్రేమలో పడి వారితో బ్రేకప్ అయ్యాడు రణబీర్ కపూర్. మొదటిసారి దీపికా పదుకునేను ప్రేమించాడు. ఆతర్వాత ఆమెకు దూరమయ్యాడు. అనంతరం కత్రినాకైఫ్‌తో ప్రేమాయణాన్ని కొనసాగించి ఆమెను వదులుకున్నాడు. అయితే ఇటీవల రణవీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపిక తన వివాహ రిసెప్షన్‌కు రణబీర్‌ను ఆహ్వానించింది. అయితే రణబీర్ రాకపోవడంతో అతని మనస్తత్వం అంతేనని దీపిక దూషించింది. అది చాలదన్నట్టు తాజాగా రణబీర్‌కు మరో పరాభవం తప్పలేదు. మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ సైతం అతన్ని మరో రకంగా మనోవేదనకు గురిచేసింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘జీరో’ కథాంశం ప్రస్తుతం హాట్ టాపిక్. ఇందులో కత్రిన తన నిజ జీవిత పాత్రను తెరపైనా పోషించింది. ఒక అందాల కథానాయిక జీవితంలో ప్రేమ విఫలమయ్యాక మద్యానికి బానిసవుతుంది. ఆ క్రమంలోనే తన ఆవేదనను తెరపై ఎమోషనల్‌గా చూపించారు. నిజ జీవితంలో రణబీర్‌తో ప్రేమ విఫలమయ్యాక కత్రిన అతిగా మద్యాన్ని సేవించేది. ఆ సన్నివేశాలను తెరపై చూపించారట. అయితే ‘జీరో’ చిత్రాన్ని చూడాలనుకున్న రణబీర్‌ను అతని స్నేహితులు వద్దని వారించారట. సినిమాలోని కత్రిన సన్నివేశాలను అతనికి వివరించారట. దీంతో జీవితంలో ఎప్పటికీ ‘జీరో’ చిత్రాన్ని చూడకూడదని రణబీర్ నిర్ణయించుకున్నాడట. ఈ సినిమా చూస్తే తాను బాధపడటం ఖాయమని అతను భావించాడట. ప్రస్తుతం రణబీర్ కపూర్ యంగ్ బ్యూటీ అలియాభట్‌తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Another kind of tension to Ranbir Kapoor

Telangana News