తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు కనుమరుగవుతున్న సందర్భంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను మహేష్, వెంకటేశ్‌లతో తెరకెక్కించిన నిర్మాత దిల్‌రాజు. అక్కడి నుంచి మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్పటికే వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లతో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదికాకుండా మరో మల్టీస్టారర్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు శ్రీకారం చుడుతున్నాడట. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అమీ తుమీ, జెంటిల్మన్, సమ్మోహనం వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను ఫిల్మ్‌మేకర్స్ వెల్లడించనున్నారు