Search
Monday 24 September 2018
  • :
  • :

మరో రూ.100 కోట్ల ఖర్చు!

Super Star Rajinikanth's 2.0 Teaser to be out in IPL Final?

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘2.0’ విడుదల  ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఏడాది అవుతున్నా ఇంతవరకు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు ఫిల్మ్‌మేకర్స్. ప్రస్తుతం గ్రాఫిక్స్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇప్పటికే రూ.400 కోట్లను ఖర్చు పెట్టారు చిత్ర నిర్మాతలు. ఇదికాకుండా మరో రూ.100 కోట్ల దాక ఖర్చు పెట్టిస్తున్నాడట స్టార్ డైరెక్టర్ శంకర్. సినిమా క్వాలిటీ విషయంలో రాజీపడని శంకర్ ఈ చిత్రం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్లే నిర్మాతలపై అదనపు భారం పడుతోందని అంటున్నారు. ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యమైతే సినిమాపై ఉన్న ఆసక్తి రోజు రోజుకు సన్నగిల్లడం ఖాయం. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Comments

comments