Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తెరపైకి మరో కుంభకోణం

bnna

రూ.800 కోట్లతో రొటొమాక్ పెన్నుల యజమాని అదృశ్యం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,400 వేల కోట్ల భారీ కుంభకోణం నేపథ్యంలో అలాంటి స్కామ్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రొమాటిక్ పెన్స్ యజమానికి విక్రమ్ కొఠారీ రూ.800 కోట్ల రుణాలను తీసుకొని.. విదేశాలకు పారిపోయినట్టు సమాచారం. ఈయన కూడా ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీగా కుచ్చుటోపీ పెట్టాడని తెలుస్తోంది. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వంటి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. నియమాలను ఉల్లంఘించి బ్యాంకులు కొఠారికి రుణాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అత్యధికంగా యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. దీనిలో అసలు, వడ్డీ రెండూ కూడా తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. కాన్పూరులో ఉన్న కొఠారి కార్యాలయం కూడా గత కొన్ని వారాలుగా మూతపడి ఉంది. ఆయన కూడా కనిపించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తుండగా.. అలహాబాద్ బ్యాంక్ మేనేజర్ దీనిపై స్పందించారు. కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రాబడతామని చెప్పుకొచ్చారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పిఎన్‌బిని మోసగించి వేల కోట్లు అప్పుగా తీసుకున్న ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ రొటొమాక్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. అయితే బ్యాంకులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని రొటోమాక్ గ్రూప్ నుంచి ప్రకటన వెలువడింది.

Comments

comments