Search
Wednesday 21 November 2018
  • :
  • :

నాగార్జునసాగర్ డ్యాంకు మరో స్పిల్‌వే

 Another spillway to the Nagarjunasagar dam

నాగార్జునసాగర్: ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ డ్యాం లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు వేల గ్రామాలకు విద్యుత్ కాంతులను అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు మరోస్పిల్‌వే ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇటీవల నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డిఎస్‌ఆర్‌పి) కమిటీ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీస్థాయిలో వరద నీరు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు మరో స్పిల్‌వే అవసరమని సూచించారు. ఖరకపూర ఐఐటి వారు కృష్ణానదికి వస్తున్న వరదలపై చేసిన సర్వేలో వాతవరణంలో వస్తున్న మార్పులు, జలాశయంలో ఎర్పడుతున్న పూడికతో డ్యాం నీటి సామర్థం కోల్పోతుందని జలాశయంకు బారీ స్థాయిలో వరద నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో స్పిల్‌వే అవసరం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు సీడబ్లూసీకి నివేదక సమర్పించారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణానదికి వచ్చిన వెయ్యేళ్ల గరిష్ట వరద ప్రవాహం 20.60 లక్షల క్యూసెక్కులుగా అంచనాలు తీసుకున్నారు. దీనిలో గరిష్ట వరద ప్రవాహం 10.60 లక్షల క్యూసెక్కులు మాత్రమే కాగా ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులతో 2008వ సంవత్సరంలో మాదిగిగా అంచనాలకు మించి ఎగువ నుండి వారి వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు లెక్కలను పరిగణలోకి తీసుకొని నాగార్జునసాగర్ డ్యాంకు మాత్రమే మరోస్పిల్‌వే అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాగునీటి పారుదల ఇంజనీర్లకు సాగర్ డ్యాం పరిరక్షణ కమిటీ సూచించింది.
నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలోనే ఇంజనీర్లు జలాశయంకు భారీ వరదల ముప్పును ఎదుర్కునే విధంగా జలాశయం నిర్మాణ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జలాశయంలో డైవర్షన్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. డ్యాం నిర్మాణ జరిగి ఇప్పటికి 63 ఏళ్ళు కావడంతో డైవర్షన్ టన్నెల్ పూడికతో మరమత్తులకు నోచుకోవడంతో టన్నెల్ నేడు ఉపయోగం లేకుండా పోవడంతో జలాశయంకు మరో స్పిల్‌వే అవసరం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి డ్యాం మీద నుండి నీటి ప్రవాహం జరిగితే వేల కోట్ల రుపాయలతో నిర్మాణమైన విద్యుదుత్పాదన కేంద్రాలు నీట మునగ నున్నాయి. ఇలాంటి నష్టం వాటిల్లక ముందే నాగార్జునసాగర్ డ్యాం ఎడమవైపున ఉన్న మట్టికట్టపైన మరోస్పిల్‌వేను ఏర్పాటు చేస్తే మున్ముందు వచ్చే వరదలతో ఈడ్యాంకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.

Comments

comments