Home తాజా వార్తలు అదరగొడుతున్న ‘అంత‌రిక్షం’ ట్రైల‌ర్

అదరగొడుతున్న ‘అంత‌రిక్షం’ ట్రైల‌ర్

Antarikshamమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంత‌రిక్షం’. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంత‌రిక్షం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న’అంత‌రిక్షం’ ట్రైలర్ సింప్లీ సూపర్బ్ గా ఉంది. హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి స్వరాలు అందిస్తున్న ఈ మూవీ ఆడియో త్వరలోనే విడుదల కానుంది. అలాగే సినిమా ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతోంది.

Antariksham 9000 KMPH Theatrical Trailer Released

Telangana Breaking News