Home సినిమా హర్రర్ థ్రిల్లర్

హర్రర్ థ్రిల్లర్

reshmi

ఎస్.జై ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘అంతకు మించి’. జై, రష్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జానీ దర్శకుడు. సరికొత్త పాత్రలో రష్మీ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకొని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగానే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చెప్పారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ “దర్శకుడిగా నా తొలి చిత్రమిది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు సహా అందరి పాత్రలు చాలా సహజంగా ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః బాల్ రెడ్డి, సంగీతంః సునీల్ కశ్యప్, ఎడిటర్‌ః క్రాంతి, మాటలుః మోహన్ చందా.