Home అంతర్జాతీయ వార్తలు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు బ్యాన్!

యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు బ్యాన్!

Hand-Wash-Soapsవాషింగ్టన్ : అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులపై నిషేధం విధించింది. ఈ నిబంధన ప్రకారం దాదాపు 19రకాల ఉత్పత్తులపై నిషేధం అమలులోకి రానుంది. ట్రైక్లోసిన్, ట్రైక్లోకార్బన్ వంటివాటిని వినియోగించకూడదని పేర్కొంది. దీంతో వీటిని ఉపయోగించిన యాంటీ బ్యాక్టీరియల్ వాష్‌లను విక్రయించకూడదని వెల్లడించింది. అంతకు ముందు వీటి వినియోగంతో ఇన్ఫెక్షన్ల నివారణ సాధ్యమని వాటి తయారీ కంపెనీలు నిరూపించుకోలేకపోయాయి.