Home మన ఆరోగ్యం నేరేడు పొడితో ఫ్లోరైడ్‌కు విరుగుడు..!

నేరేడు పొడితో ఫ్లోరైడ్‌కు విరుగుడు..!

Antidote to fluoride with Apricot powder

దేశంలో చాలా ప్రాంతాలను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ లోని నల్లగొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మహమ్మారి ప్రజల ఎముకలను గుల్ల చేస్తోంది. శరీరాకృతిని వంకరగా మార్చి వేస్తోంది. దీన్ని నిర్మూలించడానికి వైద్య పరంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రక్రియలు రూపొందుతున్నాయి. అటువంటి కొత్త ప్రక్రియను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ పరిశోధకులు కనుగొన్నారు. నేరేడు విత్తనం పొడిని చైతన్యం పరిచి ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న నీటిలో కలిపి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించ గలిగినట్టు వారు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 1.5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఉండరాదు. ఈ పరిశోధక బృందానికి కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకులు నాయకత్వం వహించారు.

పొటాసియం హైడ్రాక్సైడ్‌లో ఎక్కువ సార్లు నేరేడు విత్తన పొడిని కలుపుతూ 900 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో గంటసేపు మరిగిస్తే చైతన్యవంతమైన నేరేడు పొడి ద్రవం తయారవుతుంది. ఫలితంగా ఫ్లోరైడ్ తేట మీదకు తేలుతుంది. పొటాసియం హైడ్రాక్సైడ్ కలపకుండా 900 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి వరకు మరిగించినా అనుకున్న ఫలితం రాదు. పొటాసియం హైడ్రైడ్ శాతం తగ్గుతున్న కొద్దీ ఫ్లోరైడ్ అణు నిర్మూలన పెరుగుతుంది. పొటాసియం హైడ్రైడ్ 3 వద్ద గరిష్ట స్థాయిలో తేట కనిపిస్తుంది. చైతన్యవంతమైన నేరేడు విత్తనం పొటాసియమ్ హైడ్రైడ్ తక్కువ స్ధాయిలో ఉన్నప్పుడు అనుకూలమైన సామర్ధాన్ని సంపాదిస్తుంది. ఆ అనుకూలత ఫ్లోరైడ్ అణువులను ఆకర్షిస్తుంది. క్షార ద్రావణం లోని వ్యతిరేకత ఫ్లోరైడ్ అణువులను తరిమి వేస్తుంది. గ్రాముకు 3.65 మిల్లీ గ్రాముల వంతున ఫ్లోరైడ్‌ను నిర్మూలించే సామర్థం నేరేడు విత్తనానికి కలుగుతుంది. ఇది టీపొడి గుండకు చేరువుగా ఉంటుంది.

నల్లగొండ జిల్లా జలాలతో ప్రయోగం భారీ స్థాయిలో ఫ్లోరైడ్ విస్తరించిన నల్లగొండ జిల్లా లోని భూగర్భ జలాలను తీసుకుని ప్రయోగశాలలో నేరేడు పొడితో పరీక్షలు జరిపామని పరిశోధకులు చెప్పారు. నేరేడు పొడి నీటిలో పూర్తిగా కలిసిన 2 గంటల తరువాత నీటిలో ఫ్లోరైడ్ స్థాయిని లీటరుకు 3.2 మిల్లీ గ్రాముల వరకు తగ్గించ గలిగామని పరిశోధకులు తెలిపారు. చైతన్య పరిచిన నేరేడు విత్తన పొడిని 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడికి మరిగించగా ఫ్లోరైడ్ నిర్మూలన ప్రారంభమైందని అదే పొడిని మరో ఐదు సార్లు ఉపయోగించ వచ్చని వివరించారు. 96 శాతం వరకు ఫ్లోరైడ్ నిర్మూలన అవుతుందన్నారు. ప్రతి నిర్మూలనకు 4 శాతం సామర్థం వరకే నష్టమవుతుందని అన్నారు.

అయితే ఈ ప్రక్రియలో పైకి తేలిన ఫ్లోరైడ్ తెట్టును పరిష్కరించడం మరో ప్రక్రియ. పరిశోధక బృందం ఇప్పుడు దీనిపైనే పనిచేస్తోంది. ఉత్ప్రేరక కర్బనం నుంచి తరిమి కొట్టబడిన ఫ్లోరైడ్ నీటి కణాలు నీటిలో కొద్దిమొత్తంలో ఉండవచ్చు. మనం దానికి సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే సోడియం ఫ్లోరైడ్ తయారవుతుంది. ఈ పరిశోధన ముఖ్యాంశం ఫ్లోరైడ్ నిర్మూలన సామర్ధాన్ని కొత్తమార్గంలో ఆవిష్కరించడం, తక్కువ ఖర్చుతో కర్బన్‌ను ఉత్ప్రేరేపించడం. తరువాత తాము ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇతర భారీ లోహాలు కలిగి ఉన్న నీటిలో వాటిని నిర్మూలించడంలో నేరేడు విత్తన పొడి సామర్థం ఎంతవరకో పరిశోధిస్తామని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు పేర్కొన్నారు.

– మన తెలంగాణ/పరిశోధన విభాగం